పింఛన్ల పంపిణీ చేసే సమయంలో ఉపయోగించేందుకు నూతన ఫింగర్ ప్రింట్ స్కానర్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పింఛన్లు ఇచ్చేటప్పుడు లబ్ధిదారుల వేలిముద్రలను ఈ పరికరం సహాయంతో తీసుకుంటారు.
అయితే ఆధార్ సాప్ట్nవేర్‌ను యూఐడీఏఐ సంస్థ ఆధునికీకరించడంతో గతంలో ఉన్న పాత పరికరాలు ఉపయోగపడే అవకాశం లేదు. దీంతో అప్‌డేట్ చేసిన సాప్ట్nవేర్‌కు పనిచేసేవిధంగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాలకు 1,34,450 పరికరాలను సరఫరా చేసింది.
సచివాలయాల వారీగా ఆ పరికరాలను సిబ్బందికి అందజేయాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉత్తర్వులిచ్చింది. ఐదేళ్ల క్రితం కొనుగోలు చేసిన పరికరాలు కావడంతో ఫింగర్ ప్రింట్ సరిగా పడక సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. నూతన పరికరాల రాకతో వారి సమస్యలకు చెక్ పెట్టినట్టైంది.