న్యూ ఢిల్లీ – ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ తో (Vice President Jagdip Dhankad ) నేడు ఎపి మంత్రి నారా లోకేష్ (nara lokesh ) భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వీరు చర్చించారు. ఈ సందర్భంగా లోకేశ్ వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, (rammohan naidu) ఎంపీలు శ్రీకృష్ణదేవరాయలు (sridevakrishnadevarya) , సానా సతీశ్, బైరెడ్డి శబరి ఉన్నారు. కాగా, రెండు రోజుల పర్యటన నిమిత్తం లోకేష్ గత రాత్రి ఢిల్లీ (delhi ) చేరుకున్నారు.. ఆయన నేడు , రేపు పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఇక నేటి మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్, సాయంత్రం 4.30 గంటలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సాయంత్రం 5.30 గంటలకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌తో లోకేశ్ సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు.
New Delhi ఉప రాష్ట్రపతి తో నారా లోకేష్ భేటి
