నెమలి వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

తిరువూరు, ఆంధ్రప్రభ ; గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో నిర్వహించనున్న వేణుగోపాల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు తొలి ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు అందజేశారు. ఈ బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 5 వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. దేవస్థానం కార్యనిర్వాహణాధికారి నేల సంధ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిసి ఆహ్వాన పత్రికను అందజేసి కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. ఆలయ ప్రధాన అర్చకుడు టి. గోపాలచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాల ప్రాముఖ్యతను వివరించారు. గ్రామ ప్రజల సహకారంతో బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Leave a Reply