Nellore District | యువకుడి ఆత్మహత్య
Nellore District | నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం ఇందిరమ్మ కాలనీ సమీపంలోని జామాయిల్ చెట్లల్లో ఓ యువకుడు చనిపోయాడు. స్థానికులు సోమవారం ఉదయం మృతదేహాన్ని గుర్తించారు. మృతుడు వెంకటాచలం మండలం చింతలపాలేనికి చెందిన హేమంత్ (20)గా గుర్తించారు. పాయిజన్ ఇంజెక్షన్ తీసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టుగా స్థానికులు అనుమానిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న వెంకటాచలం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ నిమిత్తం జీజీహెచ్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

