Telangana | ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు

Telangana | ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు
Telangana | మక్తల్, ఆంధ్రప్రభ : తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని స్థానిక నెహ్రూ గంజ్ ఆవరణలో భారతదేశ తొలి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ (Pandit Jawaharlal Nehru) జయంతి సందర్భంగా మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ రాధా లక్ష్మారెడ్డి, వైస్ చైర్మన్ బి.గణేష్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ… కార్యక్రమంలో పండిత్ జవహర్ లాల్ నెహ్రూ (Pandit Jawaharlal Nehru) సేవలను కొనియాడారు. నెహ్రూకు చిన్న పిల్లలు అంటే అమితమైన ప్రేమని అన్నారు. అందుకే పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలను బాలల దినోత్సవం (Children’s Day) గా జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా నెహ్రూ జయంతి వేడుకల్లో నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొన్న చిన్నారులకు గులాబీ పువ్వులు, నోట్ బుక్స్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు (Market Committee Directors) ఎం.శ్రీనివాసులు, పారేవుల విష్ణువర్థన్ రెడ్డి, పసుల రంజిత్ రెడ్డి, సాలంబిన్ ఉమర్ బస్రవి, ఫయాజ్, ఆంద్యాల జనార్దన్ గుప్తా, నాగప్ప, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటీసీ జి.లక్షారెడ్డి, కోళ్ళ వెంకటేష్, కట్ట సురేష్ కుమార్ గుప్తా, కావాలి తాయప్ప, కట్ట వెంకటేష్, చందాపూర్ రాములు, రాంరెడ్డి, మాజీ సర్పంచ్ అశోక్ గౌడ్,గుంతలి రవి, మాజీ కోఆప్షన్ సభ్యులు బి.శంషొద్దిన్, వాకిటి నాగు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు వాకిటి భాస్కర్ , యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బ్యాగరి సురేష్, నాయకులు వాకిటి శ్యామ్, అధ్యక్షులు అఫ్రోజ్, నాదిర్, మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు మరాఠీ కృష్ణా రెడ్డి కమిషన్ ఏజంట్స్ తదితరులు పాల్గొన్నారు.
