ఇప్పగూడెంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

ఇప్పగూడెంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..
పొలంలో స్తంభం వంగినా స్పందన లేదు…
విద్యుత్ శాఖ ఏమి చూస్తోంది?
ప్రమాదం జరిగితేనే చర్యలు తీసుకుంటారా..!
విద్యుత్ శాఖకు రైతు ప్రాణం కంటే నిర్లక్ష్యమే పెద్దదా?
ఎప్పుడు కూలుతుందోనన్న ఆందోళనలో రైతు కుటుంబం
స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెం గ్రామ శివారులో ఓ చిన్న రైతు పొలంలో ప్రమాదం పొంచి ఉంది. చెమటోడ్చి వరి పంట సాగు చేస్తున్న రైతు జూలుకుంట్ల ప్రకాష్ రెడ్డి ఇప్పుడు ప్రకృతి కష్టాలతో పాటు విద్యు త్ శాఖ నిర్లక్ష్యంతోనూ పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పొలం మధ్య గానే వెళ్లే ఎస్ఎస్164 ట్రాన్స్‌ఫార్మేషన్ లైన్ పరిధిలోని విద్యుత్ లైన్‌కు సంబంధించిన స్తంభం కొంతకాలంగా వంగి ప్రమాదకర స్థితిలో నిలిచి వుంది. గాలులు, వర్షాల కారణంగా అది మరింత కిందికి ఒరిగి ఎప్పుడు కూలి పోతుందోనన్న పరిస్థితికి చేరింది.
స్తంభం వంగిపోవడంతో విద్యు త్ వైర్లు కూడా కిందకు వాలిపోతుండటంతో ఎప్పుడైనా ప్రమాదం సంభ వించే అవకాశం ఉందని పలువురు తెలుపుతున్నారు. బుధవారం ఈ దృశ్యాన్ని ఆంధ్రప్రభ ప్రతినిధి ఫొటోగా బంధించారు. పొలంలో పని చేయాలంటే ఆ స్తంభం కిందే తిరగాల్సి వస్తోంది. కూలీలు పనిచేసినా గుండెల్లో గుబులు పడుతున్నారు. ఈ సమస్యపై సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు స్పందించకపోవడం స్పష్టమైన నిర్లక్ష్యంగా కనిపిస్తోం ది. రైతు ప్రాణం కాపాడటం ముఖ్యమా? లేక నిర్లక్ష్యమే కొనసాగాలా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకుని ప్రమాదాన్ని నివారిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.
