Nawabpet | రుద్రారాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దుతా..

Nawabpet | నవాబుపేట, ఆంధ్రప్రభ : రుద్రారాన్ని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేసే అవకాశం ఇవ్వాలని సర్పంచ్ అభ్యర్థి దూళ్ళ విజయ్ కుమార్ కోరారు. ఈ రోజు గ్రామంలో ఇంటింటికీ కరపత్రాలు పంచుతూ తనకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. యువత, మహిళలకు, అన్నివర్గాల ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో గ్రామ సర్పంచ్‌గా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎలాంటి సమస్యలున్నా.. తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు.
