కాంగ్రెస్ విజయం ఖాయం..
హైదరాబాద్, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర స్పోర్ట్స్ ఛైర్మన్ – శివ సేన రెడ్డి, షాద్ నగర్ MLA శంకరయ్య మిర్యాలగూడ MLA లక్ష్మారెడ్డి, తెలంగాణ ST-TRICOR – చైర్మన్ బెల్లయ్య నాయక్, హీరో సుమన్, కాంగ్రెస్ పార్టీ MLA అభ్యర్థి నవీన్ యాదవ్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా నేతలు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సారథ్యంలో ప్రజా ప్రభుత్వం ఈ రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
ఆరు గ్యారంటీల అమలులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తదితర పథకాల్ని లబ్ధిదారులకు అందిస్తున్నామని చెప్పారు. చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్అభ్యర్థి నవీన్ యాదవ్ ను ఆశీర్వదించాలని అభ్యర్థించారు. మీ అందరి సహకారంతో కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలిపిస్తే, ఈ ప్రాంతాన్ని మరింత ఆధునికంగా తీర్చిదిద్దుతాం. రోడ్లు, డ్రైనేజీ, పార్కులు, సీసీ కెమెరాలు, వైఫై జోన్లు అన్నీ అందుబాటులోకి తెస్తాం” అని హామీ ఇచ్చారు.
మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని, ఇష్టారీతిన వ్యవహరించి రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేశారని, వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిని వివరించారు. అయినప్పటి అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని వెల్లడించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని, ప్రజలు మరోసారి పార్టీకి అవకాశం ఇస్తారని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

