National Highway | నడిరోడ్డులో జనం తల్లడిల్లారు

National Highway | నడిరోడ్డులో జనం తల్లడిల్లారు
ఇది హైవే కాదు .. హెల్ వే
అధికారులకు వినోద చిత్రం
National Highway | దగదర్తి నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రభ : సిమెంట్ ట్యాంకర్ డ్రైవరు తప్పతాగాడు. దారి మర్చిపోయాడు. అంతలోనే రూటు మార్చే క్రమంలో నడిరోడ్డుపై విధ్వంసం సృష్టించాడు. ఫలితంగా జనం 8 గంటలపాటు అల్లాడిపోయారు. దారి తెన్నూ లేక తల్లడిల్లిపోయారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలో సంచలనం రేపింది. వివనాలు ఇలా ఉన్నాయి. కృష్ఱపట్నం నుంచి సిమెంట్ బల్కర్ ట్యాంకర్ కడపకు బయలుదేరింది, నెల్లూరు దాటిన తరువాత ఆ ట్యాంకర్ కడప రోడ్డులోకి వెళ్లాలి. కానీ పూటుగా మద్యం తాగిన డ్రైవరు కడపకు వెళ్లే రోడ్డును మర్చిపోయాడు. కావలి వైపు కనీసం 35 కిలోమీటర్లు దాటిన తరువాత.. స్సృహలోకి వచ్చాడు.

ఇంకేముదీ.. ట్యాంకర్ రూటు మార్చే పనిలో అదుపు తప్పాడు. అక్కడ ఓ డివైడర్ ను తప్పించే క్రమంలో ట్యాంకర్ రోడ్డుకు అడ్డం తిరిగింది. అంతే 16వ నంబరు జాతీయ రహదారిపై అర్ధరాత్రి 12 గంటల నుండి వాహన చోదకులు, పోలీసులకు జాగారణ ప్రారంభమైంది. ట్రాఫిక్ స్థంభించింది. రైల్వే ఓవర్ బ్రిడ్జి దగ్గర సింగిల్ లైన్ రోడ్డు కావడంతో ట్రాఫిక్ క్రమబద్ధీకణకు ఇబ్బందులు తప్పలేదు. నిజానికి ఈ రూటులో ప్రమాదాలు జరిగితే గంటలు తరబడి ట్రాఫిక్ స్థంభిస్తోంది. టోల్ ఫీజులు మాత్రం వసూలు చేసే నేషనల్ హైవే అధికారులు ఈ సమస్యను పట్టించుకోవటం లేదు. నిరంతరం ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుంటే.. ఇటు పోలీసుకలకు సైతం కంటిమీద కునుకు ఉండటం లేదు. ఈ రోడ్డుపై ప్రజల అవస్థలను కళ్లప్పగించి ఎన్ హెచ్ ఏ ఐ అధికారులు, రహదారి నిర్వహణ సంస్థ అధికారులు చూస్తున్నారు. ఇదీ మన ఆఫీసర్ల తీరూతెన్నూ..
