National Herald | బీజేపీ వేధింపులు ఆపాలి..
- నల్గొండలో కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం
- బీజేపీ కార్యాలయ ముట్టడికి యత్నం
- పలువురి నాయకుల అరెస్ట్.. ఉద్రిక్తత
National Herald | నల్గొండ, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ నాయకులు కదం తొక్కారు. జాతీయ కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పై నేషనల్ హెరాల్డ్(National Herald) కేసులో బీజేపీ వేధింపులను నిరసిస్తూ పట్టణంలోని గురువారం బీజేపీ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు.
డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాస్ నేత ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని తెలుసుకున్న బీజేపీ నాయకులు ముందస్తుగా అక్కడికి చేరుకున్నారు. పోలీసులు(Police) మధ్యలోనే కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సంఘటన పోలీసులకు కాంగ్రెస్ నాయకులకు స్వల్ప తోపులాట చోటుచేసుకుంది.


