మదురై – సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గతేడాది మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణాంతరం నుంచి ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీగా ఉంది. దీంతో పార్టీ సీపీఎం నూతన ప్రధాన కార్యదర్శి ఎన్నిక తప్పనిసరి అయింది. ఈ నేపథ్యంలో కేరళ మాజీ మంత్రి ఎం.ఎ. బేబీని సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఎంపిక అయ్యారు.

తమిళనాడులోని మదురైలో నిర్వహిస్తున్న పార్టీ 24వ మహాసభల్లో ఆయన్ను కొత్త సారథిగా పార్టీ ఎన్నుకుంది.

18 మందితో పొలిట్ బ్యూరో. పోలిట్ బ్యూరో ఏర్పాటు చేసారు. ఏపీ సీనియర్ నేత బీవీ రాఘవులుకు పోలిట్ బ్యూరో తిరిగి చోటు కల్పించారు.. అలాగే 84 మంది సభ్యులతో సీపీఎం కేంద్ర కమిటీనీ ఈ సభలో ఎన్నుకున్నారు.
