Nasal Congestion | వదలకుండా బాధిస్తున్న ముక్కు సమస్యలా?

Nasal Congestion | వదలకుండా బాధిస్తున్న ముక్కు సమస్యలా?

  • దీర్ఘకాలిక ముక్కు దిబ్బడ, ముక్కు కారడానికి కారణాలు-నివారణ మార్గాలు!

ఆంధ్రప్రభ : నిద్రలో శ్వాస ఆడక ఒక్కసారిగా ఉలిక్కిపడటం, బిగ్గరగా గురక పెట్టడం వంటి లక్షణాలను చాలామంది పెద్ద సమస్యగా భావించకుండా సాధారణంగానే వదిలేస్తుంటారు. అలాగే జలుబు లేకపోయినా నిత్యం నీడలా వెంటాడే ముక్కు దిబ్బడ (Nasal Congestion), ముక్కు కారడం (Runny Nose) వంటి సమస్యలను కూడా పట్టించుకోకుండా లైట్ తీసుకుంటారు.

అయితే, రోడ్డుపై వెళ్తుంటే.. కాస్త దుమ్ము రేగినా… లేదా ముందు ఉన్న వెహికిల్స్ నుంచి వ‌చ్చే పొగ కార‌ణంగా అయినా… లేదా ఎయిర్‌కండిషనర్ గాలికి కొద్దిసేపు ఎక్స్‌పోజ్ అయినా చాలు… వెంటనే ముక్కు కారడం మొదలవుతుంది. ఇక దిబ్బడ పట్టిందంటే ఆ బాధ వర్ణనాతీతం. శ్వాస ఆడక పదే పదే ముక్కు చీదాల్సిన పరిస్థితి, దీనికి తోడు వెంటనే వచ్చే… తలనొప్పి, చెవులు మూసుకుపోవడం వంటి సమస్యలు పుండు మీద కారం చల్లినట్లుగా వేధిస్తాయి.

Nasal Congestion

ఎన్ని మందులు వాడినా, ఎంత చికిత్స తీసుకున్నా ఈ పీడకలలాంటీ సమస్య వదలకుండా మిమ్మల్ని బాధిస్తుంటే, దాని వెనుక బలమైన కారణాలే దాగి ఉన్నాయని గ్రహించాలి. అసలు ఈ దీర్ఘకాలిక సమస్యలు ఎందుకు వస్తాయి? ఈ ‘ముక్కు శాపం’ నుంచి బయటపడటానికి శాశ్వత పరిష్కారం ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం.

Nasal Congestion

తరచుగా వచ్చే జలుబు లేదా ఫ్లూ కాకుండా, కొంతమందిని ముక్కు దిబ్బడ (Nasal Congestion), ముక్కు కారడం (Runny Nose) అనే సమస్యలు దీర్ఘకాలంగా వేధిస్తుంటాయి. అందులో చాలా వరకు అలర్జీలు లేదా….. ముక్కు మార్గంలో ఉండే దీర్ఘకాలిక వాపు (Inflammation)కు సంబంధించినవే.

Headache | తలనొప్పి కారణాలు – నివారణ మార్గాలు

ముక్కులోని రక్త నాళాలు ఉబ్బడం (swelling)… శ్లేష్మం (mucus) పేరుకుపోవడం వల్ల శ్వాస మార్గం మూసుకుపోతుంది. దాంతో ముక్కు దిబ్బడ స‌మ‌స్య త‌లెత్తుతుంది.. ఈ సమస్యలు దీర్ఘకాలికంగా మారడానికి ప్రధానంగా ఐదు కారణాలు ఉన్నాయి. దీర్ఘకాలిక ముక్కు సమస్యలకు అలర్జీలే (Allergic Rhinitis) అత్యంత సాధారణ కారణం.

దుమ్ము, పెంపుడు జంతువుల బొచ్చు లేదా బూజు వంటి వాటిని శరీరం ప్రమాదకరంగా భావించి ప్రతిస్పందించడం వల్ల హిస్టమైన్ అనే రసాయనం విడుదలవుతుంది. ఈ హిస్టమైన్ ముక్కులో మంట, ఉబ్బరం, అధిక శ్లేష్మం ఉత్పత్తికి దారితీసి, వాతావరణం మారినప్పుడల్లా ఈ లక్షణాలు తిరగబెట్టేలా చేస్తుంది.

మరోవైపు, అలర్జీ కానప్పటికీ అలర్జీ లక్షణాల మాదిరిగానే ఉండే నాన్-అలర్జిక్ రైనైటిస్ కూడా ఒక కారణం. కాలుష్యం, సిగరెట్ పొగ, బలమైన పెర్ఫ్యూమ్‌లు లేదా చల్లటి గాలి వంటి వాతావరణ మార్పుల వల్ల ముక్కులోని రక్తనాళాలు సున్నితంగా మారడం దీనికి దారితీస్తుంది.

అలాగే, సైనస్‌లలో దీర్ఘకాలిక వాపు లేదా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే సైనసైటిస్ (Sinusitis), ముక్కు దిబ్బడతో పాటు ముఖం నొప్పి, తలనొప్పి, చిక్కని పసుపు లేదా ఆకుపచ్చని శ్లేష్మం కారడం వంటి లక్షణాలను కలిగిస్తుంది.

దీనికి అదనంగా, ముక్కు లోపలి భాగంలో పెరిగే చిన్న నాసల్ పాలిప్స్… శ్వాస మార్గాన్ని అడ్డుకుని నిరంతరంగా ముక్కు దిబ్బడను కలిగిస్తాయి.

ఇక‌ ముక్కును రెండుగా విభజించే గోడ వంకరగా ఉండే డివియేటెడ్ సెప్టం (Deviated Septum) వంటి నిర్మాణపరమైన లోపాల కార‌ణంగా కూడా తరచుగా ముక్కు దిబ్బడ బాధిస్తుంది.

Nasal Congestion

ముక్కు సమస్యలకు సరైన నివారణ, వాటికి గల నిర్దిష్ట కారణాలపై ఆధారపడి ఉంటుంది. ఉపశమనం కోసం, అలర్జీ కారకాలైన దుమ్ము, పెంపుడు జంతువుల బొచ్చుకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. నాసల్ స్టెరాయిడ్ స్ప్రేలు ముక్కులోని వాపును తగ్గించడంలో అత్యంత ప్రభావవంతమైనవిగా పరిగణిస్తారు.

అయితే వీటిని డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. అలాగే, డాక్టర్ సలహా మేరకు యాంటీహిస్టమైన్‌లు వాడటంతో ముక్కు కారడం తగ్గుతుంది. శ్లేష్మం ఉపశమనం కోసం సెలైన్ వాష్ (Neti Pot) లేదా సెలైన్ నాసల్ స్ప్రే వాడటంతో ముక్కు మార్గం శుభ్రమవుతుంది.

Scrub typhus | రాకూడదంటే ఏం చేయాలి..

రోజుకు రెండు మూడు సార్లు వేడి ఆవిరి (Steam Inhalation) పీల్చడంతో కూడా శ్లేష్మం పలుచగా మారి దిబ్బడ తగ్గుతుంది. జీవనశైలి మార్పులలో భాగంగా, డీకంజెస్టెంట్ స్ప్రేలను మూడు రోజుల కంటే ఎక్కువ వాడకుండా నియంత్రించడం ముఖ్యం. లేదంటే అది వాడటం ఆపగానే సమస్య తీవ్రమవుతుంది (Rebound congestion).

హైడ్రేటెడ్‌గా ఉండటం, గోరువెచ్చని లిక్విడ్స్ ఎక్కువగా తాగడం, గదిలో హ్యుమిడిఫైయర్ వాడటం ఈ స‌మ‌స్య‌ల‌కు ఉపశమనం లభిస్తుంది. సమస్య తీవ్రంగా ఉండి, సైనసైటిస్‌కు గురైతే వైద్యులు యాంటీబయాటిక్స్ లేదా శస్త్రచికిత్సను సూచించవచ్చు.

నాసల్ పాలిప్స్ లేదా డివియేటెడ్ సెప్టం వంటి నిర్మాణ సమస్యలకు కూడా శస్త్రచికిత్స (సెప్టోప్లాస్టీ) అవసరం కావచ్చు. ముక్కు సమస్యలు దీర్ఘకాలంగా బాధిస్తుంటే, తప్పనిసరిగా ENT (చెవి, ముక్కు, గొంతు) నిపుణుడిని సంప్రదించి… సరైన కారణాన్ని నిర్ధారించి, శాశ్వత ఉపశమనం పొందవచ్చు.

గమనిక – ఈ వ్యాసం పాఠకుల ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే అందించబడింది. ఏదైనా ముక్కు సమస్యలు ఉంటే… తగు సమయంలో వైద్యుడిని సంప్రదించడం అవసరం..

దుమ్ము, పెంపుడు జంతువుల బొచ్చు లేదా బూజు వంటి వాటిని శరీరం ప్రమాదకరంగా భావించి ప్రతిస్పందించడం వల్ల హిస్టమైన్ అనే రసాయనం విడుదలవుతుంది. ఈ హిస్టమైన్ ముక్కులో మంట, ఉబ్బరం, అధిక శ్లేష్మం ఉత్పత్తికి దారితీసి, వాతావరణం Nasal Congestion Nasal Congestionతిరగబెట్టేలా చేస్తుంది. Nasal Congestionఅలర్జీ కానప్పటికీ Nasal Congestionలక్షణాల మాదిరిగానే Nasal Congestionనాన్-అలర్జిక్ Nasal Congesti

onకూడా ఒక Nasal Congestionకాలుష్యం, సిగరెట్ పొగ, బలమైన పెర్ఫ్యూమ్‌లు లేదా చల్లటి గాలి వంటి వాతావరణ మార్పుల వల్ల ముక్కులోని రక్తనాళాలు సున్నితంగా మారడం దీనికి దారితీస్తుంది. దుమ్ము, పెంపుడు జంతువుల బొచ్చు లేదా బూజు వంటి వాటిని శరీరం ప్రమాదకరంగా భావించి ప్రతిస్పందించడం వల్ల హిస్టమైన్ అనే రసాయనం విడుదలవుతుంది.

ఈ హిస్టమైన్ ముక్కులో మంట, ఉబ్బరం, అధిక శ్లేష్మం ఉత్పత్తికి దారితీసి, వాతావరణం మారినప్పుడల్లా ఈ లక్షణాలు తిరగబెట్టేలా చేస్తుంది. మరోవైపు, అలర్జీ కానప్పటికీ అలర్జీ లక్షణాల మాదిరిగానే ఉండే నాన్-అలర్జిక్ రైనైటిస్ కూడా ఒక కారణం. కాలుష్యం, సిగరెట్ పొగ, బలమైన పెర్ఫ్యూమ్‌లు లేదా చల్లటి గాలి వంటి వాతావరణ మార్పుల వల్ల ముక్కులోని రక్తనాళాలు సున్నితంగా మారడం దీనికి దారితీస్తుంది.

Leave a Reply