కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ జడ్పీటీసీ ఫైర్

నార్సింగి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతున్న ‘ఆత్మీయ భరోసా’ పథకం క్షేత్రస్థాయిలో నీరుగారిపోతోందని మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరు గ్రామ మహిళలు ధ్వజమెత్తారు. బాండ్లు చేతిలో ఉన్నా.. పైసలు ఖాతాల్లో పడకపోవడంతో లబ్ధిదారులు తమ ఆవేదనను వెళ్లగక్కారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ బాణపురం కృష్ణారెడ్డి, మండల అధ్యక్షులు మైలారం బాబు, ప్రధాన కార్యదర్శి భూపతి రాజు లను కలిసిన మహిళలు, తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ బాండ్లను ప్రదర్శించారు.
