Narsinghi | నట్టల నివారణ మందు వేయించాలి

Narsinghi | నార్సింగి, ఆంధ్ర‌ప్ర‌భ : ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న నట్టల నివారణ మందును గొర్రెల, మేకల పెంపకదారులు వినియోగించుకోవాలని సర్పంచ్ ఆకుల సుజాత మల్లేష్ గౌడ్ తెలిపారు. ఇవాళ‌ మండల కేంద్రంలో మందు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈసంద‌ర్భంగా మండల పశువైద్యాధికారి సుధాకర్ దేశ్ముఖ్ మాట్లాడుతూ… గ్రామంలో 1649 గొర్రెలకు, 1036 మేకలకు నట్టల మందు అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు.

Leave a Reply