Narendra Reddy | ప్రచారంలో దూసుకెళ్తున్న బీఆర్‌ఎస్
- హామీల అమలులో ప్రభుత్వం విఫలం
- పలు గ్రామాల్లో ప్రచారం
- కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి
Narendra Reddy | మద్దూర్, ఆంధ్రప్రభ : బీఆర్‌ఎస్ హయాంలో గ్రామాలు, పట్టణాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయని, రేండేళ్ల కాంగ్రెస్ పాలనలో పల్లెలు, పట్టణాలు అభివృద్ధిలో వెనుకబడిపోయాయని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి(Narendra Reddy) విమర్శించారు. సోమవారం ఆయన మద్దూర్ మండల పరిధిలోని నందిపాడ్, పల్లెర్ల, లక్కయపల్లి గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో బీఆర్‌ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
నందిపాడ్ గ్రామంలో ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ… బీఆర్‌ఎస్ హయాంలో గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్ అభ్యర్థి గొల్ల నరేష్ చాలా కృషి చేశారు. కాబ్బటి బీఆర్‌ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను(Sarpanch candidates) గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అమలు చేయకపోవడంతో ప్రజలు గోస పడుతున్నారన్నారు.

