Narayanpeta | రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఊట్కూర్ విద్యార్థి

Narayanpeta | రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఊట్కూర్ విద్యార్థి
Narayanpet | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థి రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికై పలువురి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. ఈనెల 8న మక్తల్ మండల పరిధిలోని కర్నిలో నిర్వహించిన ఖోఖో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థాయి పోటీల్లో నారాయణపేట జిల్లా నుండి ఊట్కూర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి గోవింద్ తన అత్యున్నత ప్రతిభ కనబరిచి ఈనెల 30 నుండి వచ్చేనెల 2 వరకు వికారాబాద్ జిల్లాలో జరిగే 69వ రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ రాష్ట్ర అండర్ 14 క్రీడా ఖోఖో పోటీలలో విద్యార్థి పాల్గొంటున్నట్లు పాఠశాల పీడీ సాయినాథ్ తెలిపారు.
విద్యార్థి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక కావడంతో పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం మురళి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం అభినందించి సన్మానించారు.
