Delhi | బ్రిట‌న్ మాజీ ప్ర‌ధాని టోనీ బ్లేయ‌ర్ తో నారా లోకేష్ భేటి

ఢిల్లీ : ఏపీ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఢిల్లీలో రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా బ్రిటన్ మాజీ ప్రధాని (Britain Former Prime Minister), టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్(టీబీఐ) వ్యవస్థాపకుడు టోనీ బ్లేయిర్‌తో మంత్రి సమావేశమయ్యారు. న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లో టోనీని లోకేష్ కలుసుకుని పలు అంశాలపై చర్చించారు.

ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యలో ఏఐ టూల్స్ (AI tools) వినియోగంపై ప్రధానంగా చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్లు స‌మాచారం. రాష్ట్రంలో అమలు చేస్తున్న నైపుణ్యాభివృద్ధి ఎజెండా, స్కిల్ సెన్సస్ (Skill Census), దేశం వెలుపల యువతకు ఉపాధి వంటి అంశాల్లో టీబీఐ సాంకేతిక మద్దతుపై ఈ సమావేశంలో చర్చించారు. నైపుణ్య శిక్షణ అంశాలు, గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ స్థాపనకు సహకారంపై ఒప్పందం కుదిరింది. అలాగే ఉన్నత విద్యలో సంస్కరణలు, సాంకేతిక మద్దతుపై సమీక్ష నిర్వహించారు.

Leave a Reply