Nandyala | పుణ్యక్షేత్రం శ్రీశైల దేవస్థానంలో హుండీల లెక్కింపు…

Nandyala | పుణ్యక్షేత్రం శ్రీశైల దేవస్థానంలో హుండీల లెక్కింపు…
- రు. 3.73 కోట్లు హుండీ లో… బంగారు విదేశీ కరెన్సీ…
Nandyala | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఈ రోజు హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టినట్లు కార్య నిర్వాహణాధికారి ఎం శ్రీనివాసరావు తెలిపారు. హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ. 3,72,50,251/- నగదు రాబడిగా లభించిందన్నారు.
ఈ హుండీల రాబడిని భక్తులు గత 21 రోజులలో అనగా డిసెంబర్ గత ఏడాది డిసెంబర్ 22 నుండి ఈ ఏడాది 11 వరకు సమర్పించడం జరిగిందన్నారు. ఈ హుండీలో 158 గ్రాముల 200 మిల్లీగ్రాముల బంగారు, 11 కేజీల 460 గ్రాముల వెండి లభించాయన్నారు. అదేవిధంగా 1570 యుఎస్ఏ డాలర్లు, 180 యు.ఎ.ఇ దిర్హమ్స్, 1- కువైట్ దినార్, 5 – సౌదీరియాల్స్, 17 – సింగపూర్ డాలర్లు, 10 – కెనడా డాలర్లు, 65 – ఇంగ్లాండు ఫౌండ్స్ , 11 – మలేషియా రింగిట్స్, 12510 – ఓమన్ బైసా, 50 – ఆస్ట్రేలియా డాలర్లు, 8 – ఈరోస్, 5 – ఐర్లాండ్, 1500 – మయన్మార్, 10,000 – ప్రాన్స్ , 50 – ఫిలిప్పీన్, 2000 – వియత్నామ్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయన్నారు.
పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగిందన్నారు. ఈ హుండీల లెక్కింపులో కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు ఎ.వి. రమణ, చిట్టిబొట్ల భరద్వాజ శర్మ, డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి ఆర్.రమణమ్మ, పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు.
