Nandyala | విజయ డెయిరీ వద్ద ఉద్రిక్తత
- మామ కోడళ్ళ సవాల్
- పాల ఉత్పత్తిదారులు చైర్మన్ వర్సెస్ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే
- పాలకమండలి త్రీ సభ్య కమిటీ సమావేశం
Nandyala | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలో విజయ పాల ఉత్పత్తి కర్మాగారంలో రాజకీయ ఆధిపత్య పోరు మొదలైంది. ఆళ్లగడ్డ రాజకీయం నంద్యాల పాల ఉత్పత్తిదారుల కార్యాలయం సంఘానికి చేరుకుంది. ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పాల ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ పదవిపై టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పట్టు సాధించేందుకు తన తమ్ముడు జగత్ విక్యత రెడ్డికి పదవిని కట్టపెట్టేందుకు పలు ప్రయత్నాలు చేస్తుంది. పాల కేంద్రం వద్ద సోమవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పోలీసులు కూడా భారీ సంఖ్యలో కాపలా ఉన్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో ఉత్కంఠ రీతిలో పరిస్థితి ఉంది. భూమా అనుచరులు పాల కేంద్రం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. రెండు వర్గాలు భారీగా అక్కడికి చేరడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. దీంతో డెయిరీ వద్ద భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.

ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసుల అప్రమత్తంగా ఉన్నారు. భూమా జగత్ విఖ్యాత రెడ్డి చక్రవర్తిల పల్లె డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. ఆ ఎన్నిక చెల్లదని కమిటీ తీర్మానించడంతో తిరిగి ముత్యాలపాడు సొసైటీ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. దీనిపై ఈరోజు త్రిసభ్య కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
గతంలో రూ.1.20 కోట్ల బకాయిలు ఉన్నారని త్రిష కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఉదయం హాజరు కావాలని ముత్యాలపాడు సొసైటీ పాలక వర్గ సభ్యులకు నోటీసులు పంపామని సభ్య కమిటీ సభ్యులు పేర్కొంటున్నారు. ఉదయం 11 నుంచి ఒంటిగంట వరకు చూశామని ముత్యాల పాడు సొసైటీ పాలకవర్గ సభ్యులు హాజరు కాలేదని కమిటీ సభ్యులు తెలుపుతున్నారు.
మీడియాతో త్రిసభ్య కమిటీ సభ్యులు గంగుల విజయ్ సింహారెడ్డి, పీపీ మధుసూదన్ రెడ్డి, రవికాంత్ రెడ్డిలు మాట్లాడుతూ డైరెక్టర్లకు మరల ఎన్నికలు జరిపేందుకు తీర్మానం చేస్తుందని తెలిపారు. తుది నిర్ణయం తర్వాత ఎన్నికలకు వెళ్తామన్నారు.
ప్రస్తుత ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సొంత మేనమామ ఎస్వీ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం విజయ పాల ఉత్పత్తి డెయిరీ చైర్మన్ గా ఉన్నారు. వీరి మధ్య గత రెండు సంవత్సరాలుగా ఆధిపత్య పోరు నడుస్తుంది. భూమా అఖిల ప్రియ జేజి నాయన అయినా భూమా నారాయణ రెడ్డి గతంలో 40 సంవత్సరాలుగా విజయపాలు ఉత్పత్తి డెయిరీ చైర్మన్‌గా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆళ్లగడ్డకు చెందిన భూమా అఖిలప్రియ మేనమామ ఎస్‌వి జగన్మోహన్ రెడ్డి పదవి దక్కించుకున్నారు. ఈ వ్యవహారంలో గత ఐదు రోజుల క్రితం సభ్యులను గృహ నిర్బంధం చేసిన సంఘటనపై జిల్లా వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఏం జరగనుందో కాలమే నిర్ణయించాలి.

