Nandyal | వాజ్ పాయ్ జన్మదిన వేడుకలు..

Nandyal | వాజ్ పాయ్ జన్మదిన వేడుకలు..

Nandyal Bureau, ఆంధ్రప్రభ : దేశ మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్ పాయ్ జన్మదిన వేడుకలు నంద్యాల పట్టణంలో బీజేపీ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. అటల్ – మోదీ సుపరి పరిపాలన బస్ యాత్రలో భాగంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో అటల్ జీ విగ్రహన్ని జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అభిరుచి మధు ప్రతిష్ట కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అటల్ బిహారి వాజ్ పాయ్ శతజయంతి సందర్బంగా జిల్లా బీజేపీ శాఖ వేడుకలను ఘనంగా జరుపుకుంది. బీజేపీ కార్యాలయంలో ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

దేశంలో జాతీయ రహదారులు ఏర్పాటుకు మూల వ్యక్తి అటల్ జీ అన్నారు. టెక్నాలజీ పరంగా ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోను ఉందంటే దానికి మూల కారకులు మన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్ అన్నారు. అటల్ జీ, కాశ్మిర్ నుంచి పాకిస్తాన్ లాహోర్ కు బస్సు ను ప్రారంభించిన ఏకైక వ్యక్తి అని, మంచి పాలన ఇచ్చిన వ్యక్తి అటల్ జీ అని.. ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కశెట్టి చంద్రశేఖర్, నాయకులు వంకదార గోపాలకృష్ణమూర్తి, జిల్లా ఉపాధ్యక్షులు పసపుల రవీంద్ర, మురళీ చౌదరి, చాందిని, మైనార్టీ నాయకులు మహబూబ్ భాషా, జిల్లా కార్యదర్శి కూరాకు భరత్, హేమంత్, వెంకటేశ్వర్లు, స్వామిరెడ్డి, గాండ్ల ఈశ్వర్, కొమ్మ శ్రీహరి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు బిజ్జం సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షులు నాగేశ్వర్ రెడ్డి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీలక్ష్మి, వాణి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply