Nandigama | ప్రజల వద్దకే అధికారులు..

Nandigama | ప్రజల వద్దకే అధికారులు..
- కూటమి పాలనలో నేరుగా ప్రజాప్రతినిధులు
- ప్రజా దర్బార్‌లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
- ప్రజా సమస్యలపై స్పందన
Nandigama | నందిగామ రూరల్, ఆంధ్రప్రభ : పట్టణం 16వ వార్డు దుర్గా నగర్‌లో ఈ రోజు నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మున్సిపల్ చైర్మన్ మండవ కృష్ణకుమారి, వార్డు కౌన్సిలర్లు అధికారులు, కూటమి నేతలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేరుగా ప్రజల నుంచి వినతులను స్వీకరించి వారి సమస్యలను శ్రద్ధగా విన్నారు. ప్రజా దర్బార్‌లో అందిన ప్రతి వినతిని ఆన్‌లైన్ చేయడం జరుగుతుందని, తద్వారా ప్రతి సమస్యపై పారదర్శకంగా పరిష్కార చర్యలు చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు. కూటమి పాలనలో ప్రజల వద్దకే అధికారులు వచ్చి సమస్యలు పరిష్కరించే విధానం అమలులో ఉందని, ఇది ప్రజాస్వామ్యానికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నందిగామ మున్సిపల్ పరిధిలో కూటమి ప్రభుత్వ హయాంలో ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. అందులో భాగంగా 16వ వార్డులోనే 20 లక్షల రూపాయల వ్యయంతో రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. ప్రతి వార్డులో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, ప్రజలు ఎదుర్కొంటున్న చిన్నా–పెద్దా ప్రతి సమస్యపై దృష్టి కేంద్రీకరించి పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సహకారంతో నందిగామను మరింత అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆమె స్పష్టం చేశారు.
