శ్రీకాకుళం, ఫిబ్రవరి 13 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారిని దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కుమారుడు నందమూరి రామకృష్ణ గురువారం దర్శించుకున్నారు. ఆయనకు వేదమంత్రాలతో మంగళ వాయిద్యాలతో శాసనసభ్యులు గొండు శంకర్ ప్రత్యేక ఆహ్వానం పలికారు. ఈసందర్భంగా క్షీరాభిషేకం, ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ ప్రత్యేకతను ఆలయ విశిష్టతను తెలిపారు.
ఈసందర్భంగా శంకర్ మాట్లాడుతూ… సూర్యనారాయణ స్వామి ప్రత్యక్షంగా ప్రత్యేక పూజలు అందుకోవడంలో ఏకైక దేవాలయంగా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయమని, ఈ దేవాలయానికి ఏడాది పొడుగునా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయని, అందులో భాగంగా మాఘ పౌర్ణమి పూజలు విశేషంగా జరుగుతాయని అన్నారు. అనంతరం అనివెట్టి మండపంలో వేద పండితులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.