Nandamuri Mokshajna | మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు..?

Nandamuri Mokshajna | మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు..?

Nandamuri Mokshajna నట సింహం నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ (Mokshagna) ఎంట్రీ గురించి గత కొంతకాలంగా వార్తలు అయితే వస్తున్నాయి కానీ.. ఆయన తొలి సినిమా సెట్స్ పైకి మాత్రం రావడం లేదు. ఆమధ్య ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ తొలి సినిమా అంటూ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. అంతా సెట్ అయ్యింది.. ఇక సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం అనుకుంటుటే.. ఊహించని విధంగా ఆ సినిమా ఆగిపోయింది. ఇంత వరకు మోక్షజ్ఞ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ రాలేదు. అసలు ఈ క్రేజీ ప్రాజెక్ట్ వెనుక ఏం జరుగుతోంది..? మోక్షజ్ఞ తొలి సినిమా ఎవరితో..? ఎప్పుడు..?

ప్రశాంత్ వర్మతో Nandamuri Mokshajna సినిమా క్యాన్సల్..?

మోక్షజ్ఞతో సినిమా చేయాల్సిన ప్రశాంత్ వర్మ.. హనుమాన్ సీక్వెల్ చేయాలి. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఓ మూవీ చేయాలి. ప్రస్తుతం ఈ రెండు సినిమాల ప్రీ ప్రొడక్షన్ వర్క్ పై ప్రశాంత్ వర్మ కాన్ సన్ ట్రేషన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. మోక్షజ్ఞతో ప్రశాంత్ వర్మ సినిమా లేనట్టే అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. మరి.. మోక్షజ్ఞ తొలి సినిమా ఎవరితో అంటే.. తాజాగా డైరెక్టర్ క్రిష్ పేరు వినిపిస్తోంది. బాలయ్య నటిస్తోన్న అఖండ 2 డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. బోయపాటి తెరకెక్కిస్తోన్న అఖండ 2 అంచనాలకు మించి ఉంటుందని నందమూరి అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు.

Mokshagna

ఈ సినిమా తర్వాత బాలయ్య.. గోపీచంద్ మలినేనితో భారీ చిత్రం చేయనున్నారు. ఆతర్వాత బాలయ్య.. క్రిష్ డైరెక్షన్ లో సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. ఇది ఆదిత్య 369 మూవీకి సీక్వెల్ ఆదిత్య 999 అని సమాచారం. ఇందులో మోక్షజ్ఞ కీలక పాత్ర పోషిస్తాడని.. ఈ సినిమాతోనే మోక్షజ్ఞను తెలుగు తెరకు పరిచయం చేయాలని బాలయ్య ఫిక్స్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. కొత్త సంవత్సరంలో ఈ క్రేజీ మూవీని పట్టాలెక్కించాలి అనేది ప్లాన్. మరి.. ప్రచారంలో ఉన్నట్టుగా ఆదిత్య 999 మూవీతోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందో.. లేక వేరే మూవీతో ప్లాన్ చేస్తారో క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇది కూడా చదవండి మెగా పోటాపోటీ… రికార్డ్ బ్రేక్ చేసింది ఎవరో..?

Leave a Reply