Nalgonda | రాజీమార్గమే రాజమార్గం..
Nalgonda | యాదాద్రి భువనగిరి జిల్లా, ఆంధ్రప్రభ : కోర్టు కేసుల విషయంలో రాజీ మార్గమే రాజమార్గమని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ జూనియర్ సివిల్ జడ్జి మహతి వైష్ణవి(Civil Judge Mahathi Vaishnavi) తెలిపారు. చౌటుప్పల్ కోర్టులో ఈ రోజు జూనియర్ సివిల్ జడ్జి మహతి వైష్ణవి ఆధ్వర్యంలో స్పెషల్ మెగా లోక్ అదాలత్ ఘనంగా నిర్వహించారు. ఈ లోక్ అదాలత్ కార్యక్రమంలో పెద్దఎత్తున కక్షి దారులు పాల్గొని వివిధ రకాల కేసులను రాజీవ్ మార్గంలో పరిష్కరించుకున్నారు.
కోర్టు కేసుల వల్ల ఒకరిపై మరొకరికి కక్షలు పెరగడంతో పాటు సమయం, డబ్బులు వృధా అవుతాయని, మానసిక ఆందోళన(Mental Anxiety) కలుగుతుందని, కక్షిదారులు వాస్తవాలను గుర్తించి రాజీ మార్గంలో తమ కేసులను పరిష్కరించుకోవాలని జడ్జి మహతి వైష్ణవి సూచించారు. న్యాయవాదులు కూడా కక్షిదారులకు వాస్తవాలను వివరించాలన్నారు.
ఈ కార్యక్రమం లో భార అసోసియేషన్ అధ్యక్షులు బాల్యం వెంకటాచలపతి(Venkatachalapathy), జనరల్ సెక్రటరీ పడమటి మహిపాల్ రెడ్డి, పీపీ కాజా మోహినుద్ధిన్, జీపీ మాక్తల నర్సింహా గౌడ్, న్యాయవాదులు తాడూరి పరమేష్, జక్కర్తి శేఖర్, డి శ్రీశైలం, జి రవీందర్, రాఘవేంద్ర, జంగయ్య, బడుగు శ్రీకాంత్, పి పరమేష్, సత్యనారాయణ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

