Nalgonda | కల్తీ మద్యం గుట్టుర‌ట్టు

నల్లగొండ ప్ర‌తినిధి, ఆంధ్రప్రభ :నల్లగొండ జిల్లాలో సృష్టించిన కల్తీ మద్యం తయారీ కేసులో నల్లగొండ పోలీసులు ఆదివారం ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరి నుండి 600 లీటర్ల స్పిరిట్, 600 లీటర్ల కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ వివ‌రాలు వెల్లడించారు.

ఐదుగురు నిందితులను అరెస్టు చేయగా మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు. ఈ కేసులో నిందితులైన ఐదుగురు చండూరు మండల కేంద్రానికి చెందిన వారు కాగా, ప్రధాన నిందితుడు బెంగుళూరు, మరో నిందితుడు కనగల్ మండలం జి ఎడవెల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించామ‌న్నారు. నిందితుల్లో ఎర్రజెల్ల రమేష్, శ్రీనివాస్ గౌడ్ , మహమ్మద్ జానీ పాషా, దోమలపల్లి యాదగిరి, బొమ్మరబోయిన భార్గవ్, సాయం ఉపేంద్ర, జాల వెంకటేశ్ ఉన్నారు.

సిబ్బందిని అభినందించిన ఎస్పీ..

కల్తీ మద్యం నిందితులను అరెస్టు చేసిన పోలీసు సిబ్బందిని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు. ఈనెల 6వ‌ తేదీన నాంపల్లి మండలంలో కల్తీ మద్యం తయారీ ఘటన వెలుగు చూడగానే దేవరకొండ ఏఎస్పీ మౌనిక ఆధ్వర్యంలో ప్రత్యేక టీములను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన ఏఎస్పీ మౌనిక, టాస్క్ ఫోర్స్ సీఐ రమేష్, ఎస్సైలు మహేందర్, శివప్రసాద్, నాంపల్లి సీఐ రాజు, ఎస్సై శోభన్ బాబులను ఎస్పీ పవర్ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *