Nalgonda | బ్రహ్మోత్సవాల్లో సినీ జానపద గేయాలు సందడి..

Nalgonda | బ్రహ్మోత్సవాల్లో సినీ జానపద గేయాలు సందడి..

Nalgonda, గట్టుప్పల, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా గట్టుప్పల మండలంలోని తేరటుపల్లి గ్రామంలోని శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయంలో 81వ బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం సాయంత్రం మాజీ సర్పంచ్ వీరమల్ల శ్రీశైలం గౌడ్ స్థానిక దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను,ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సినీ, జానపద కళాకారులు సంయుక్తంగా ప్రదర్శించిన కల నృత్యాలు, భరతనాట్యం, గేయాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. సాంప్రదాయ జానపద కళారూపాలకు ఆధునిక సినీ శైలిని జోడించి చేసిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ప్రతి ప్రదర్శన ముగిసినప్పుడు ఆహుతుల చప్పట్లతో ప్రాంగణం మార్మోగింది. విచ్చేసిన విశిష్ట అతిథులను, కళాకారులను సర్పంచ్ శింగం వెంకటేశం, మాజీ సర్పంచ్ వీరమల్ల శ్రీశైలం గౌడ్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నామని జగన్నాథం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కంచుకట్ల సంపత్, సర్పంచ్ భీమనపల్లి రామయ్య, మెరుగు సాలమ్మ, ఎస్ఐ సంజీవరెడ్డి, గొరిగే సత్తయ్య, చలవల్ల వెంకట రమణారెడ్డి, ఖమ్మం లక్ష్మయ్య, బొట్టు శివ, దోర్నాల అంజయ్య, మెరుగు శీను, మాధగోని వెంకటయ్య, పూసపాటి శంకరప్ప తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply