నల్లగొండ జిల్లా మత్స్యశాఖ అధికారి సుచరిత

ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : అవినీతి అధికారులెంత విస్తృత తనిఖీలు చేపట్టి లంచగొండి అధికారులను, ఉద్యోగులను పట్టుకుంటున్నా, అవినీతి ఆగడంలేదు. ప్రభుత్వోద్యోగులు పెద్ద పెద్ద జీతభత్యాలు అందుకుంటున్నా తమ బాధ్యతలు, విధులకు లంచాలకు కక్కుర్తి పడడం ఆగడం లేదు.


నల్లగొండ (Nalgonda) జిల్లా మత్స్యశాఖ అభివృద్ధి అధికారి సుచరిత గురువారం ఓ కాంట్రాక్టర్ నుండి రూ. 20,000 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సూర్యాపేట (Suryaapet) జిల్లాకు చెందిన శ్రీను అనే కాంట్రాక్టర్ అనుమతి కోసం సుచరితను సంప్రదించగా ఆమె శ్రీనును రూ. 70,000 డిమాండ్ చేసింది. దీంతో శ్రీను ఏసీబీ అధికారులకు (ACB Officials) సమాచారం అందించారు. జిల్లా కలెక్టరేట్ లోని మత్స్యశాఖ కార్యాలయం ఆవరణలో సుచరితకు శ్రీను రూ.20,000 ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చందర్, సీఐ బి వెంకట్రావు పాల్గొన్నారు.

Leave a Reply