Chityala | మహిళాభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట

Chityala | మహిళాభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట
Chityala | చిట్యాల, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) , సీఎం రేవంత్ రెడ్డి అన్నిరంగాల్లో మహిళలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారని నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం (Vemula Veeresham) అన్నారు. శనివారం తెలంగాణ ప్రగతి ఇందిర మహిళ శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో అధికారులు ఏర్పాటు చేసిన చీరల పంపిణీకి ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరై మహిళలకు చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మహిళలను అన్ని రంగాల్లో సొంతంగా ఆదాయం సంపాదించడం కోసం కుటుంబాన్ని పోషించడం కోసం అనేక పథకాలు చేపట్టారని పేర్కొన్నారు. స్కూల్ యూనిఫాం, రూ.28కోట్ల వడ్డీలేని రుణాలు, బ్యాంక్ లింకేజీ కార్యక్రమంలో 600కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఉచిత బస్సు కోసం రూ.8వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారన్నారు. ఈ పథకాన్ని చాలా మంది మహిళలు ఉపయోగించుకుంటున్నారన్నారు. రేషన్ సన్నబియ్యం పంపిణీకోసం 12వేల కోట్ల రూపాయలు ప్రభుత్యం ఖర్చు చేస్తుందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్యం (Congress government) వచ్చిన తరువాత మహిళలకు ఇష్టమైన రంగులతో చీరలను మన రాష్ట్రంలోని సిరిసిల్ల, కరీంనగర్ లో తయారు చేసిన చీరలను పంపిణీ చేస్తుందన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చేసిన సేవలు గుర్తి చేసుకుంటూ వారి పేరు మీదుగా ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీ అని నామకరణం చేశామన్నారు. అంతకుముందు మండలానికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ 27 చెక్కులు కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ 40 చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు.
