Telangana | వెల్లి విరిసిన మతసామరస్యం
ఇల్లెందులో నాగుల్ మీరా ఉర్సు ఉత్సవాలు ప్రారంభం
Telangana | ఇల్లెందు, ఆంధ్రప్రభ : ఇల్లెందులో రెండో రోజు నిర్వహించిన నాగుల్ మీరా (Nagul Meera) ఉర్సు ఉత్సవాల జూలుస్ మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. నెంబర్ టూ బస్తి నుండి జూలుస్ ప్రారంభమై పాత బస్టాండ్ మీదుగా జగదాంబ సెంటర్ నుండి ఆమ్ బజార్ నుండి కొత్త బస్టాండ్ మీదుగా సత్యనారాయణపురం (Satyanarayanapuram) అడవిలో కొలువైన నాగుల్ మీరా దర్గా వరకు చేరుకుంది.
జూలుస్ లో హైదరాబాద్ (Hyderabad) నుండి తెప్పించిన గుర్రాలు, ఒంటెలు, ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతేకాకుండా వివిధ రకాల నైవేద్యాలు తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథాలు, అమితంగా ఆకట్టుకున్నాయి. భక్తులు అడుగు అడుగున స్వాగతం పలికేందుకు బారులు తీరారు.

