Nagoba | పాదయాత్రేకులకు దుప్పట్లు పంపిణీ

Nagoba | పాదయాత్రేకులకు దుప్పట్లు పంపిణీ

Nagoba | ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ప్రఖ్యాతి గాంచిన కేసలాపూర్ రాష్ట్ర ప్రఖ్యాతి(State fame) గాంచిన నాగోబా(Nagoba) జాతర పాదయాత్రకులకు పోలీస్ ఆధ్వర్యంలో ఎస్పి అఖిల్ మాజన్ ఆదేశాలనుసారం మేశ్రమ వంశ యాత్రికులకు భారీ ఎత్తున దుప్పట్లు పంపిణీ చేశారు.

ఈ రోజు సర్కిల్ ఇన్స్పెక్టర్ మడావి ప్రసాద్, స్థానిక ఎస్సై ఈ సాయన్నల‌ ఆధ్వర్యంలో తెల్ల దుస్తుల్లో కనువిందుగా వందల కిలోమీటర్లు పాదయాత్ర(foot march, కాలికి చెప్పుల్లేకుండా నిర్వహించే జన్నారం మండలంలోని హస్తినామడుగుకు వెళ్లే భక్తులకు పోలీస్ శాఖ అధికారులు, మేశ్రమ వంశిస్తుల పూజ, నియమనిష్టలు, క్రమశిక్షణ పద్ధతులను మెచ్చుకొని పాద యాత్రకు వెళ్లే ప్రతి ఒక్క భక్తునికి దుప్పట్లను పంపిణీ చేశారు. జిల్లాలో అత్యధికంగా ఉన్న చలికి ఆసరాగా మొట్ట మొదటిసారి పోలీస్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ చేయడంతో మేస్రం వంశీయులు సంతోషం వ్యక్తం చేస్తూ జై నాగోబా జై జై నాగోబా అనే నినాదాలు చేస్తూ పోలీసులను ఆశీర్వదించారు.

Nagoba |

Leave a Reply