Nagayalanka | సహకార సంఘాల ఉద్యోగుల ధర్నా

Nagayalanka | సహకార సంఘాల ఉద్యోగుల ధర్నా

Nagayalanka | నాగాయలంక – ఆంధ్రప్రభ : సహకార సంఘాల్లో పనిచేసే సిబ్బందికి జీవో నెం.36 అమలు చేయాలని, పెండింగులో వున్న 2019 సంవత్సరం నుంచి 2024 వరకు పీఆర్ సీలను వెంటనే ఇప్పించాలని కోరుతూ ఇవాళ‌ స్థానిక కేడీసీసీ బ్యాంక్ కార్యాలయం ఎదుట నాగాయలంక, బర్రంకుల, పెదకమ్మవారి పాలెం, ఎదురుమొండి, పర్రచివర, ఏటిమొగ సంఘాల ఉద్యోగులు పాల్గొని ధర్నా చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు వలే వయో పరిమితిని 62 సంవత్సరాలకు పెంచాలని 2019 తరువాత సహకార సంఘాలలో జాయిన్ అయిన ప్రతి ఉద్యోగిని పర్మినెంట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రామాంజనేయులు, పి.శ్రీనివాసరావు నేతృత్వం వహించారు.

Leave a Reply