పంటలు ఎండిపోకుండా సాగునీరు అందించాలి

పంటలు ఎండిపోకుండా సాగునీరు అందించాలి

టిఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : ప్రభుత్వం రైతులకు సాగునీరు అందించి పంటలు ఎండిపోకుండా చూడాలని టిఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పంటలు వాడు పడుతున్నాయని త్వరగా నీరు సరఫరా చేయకపోతే ఎండిపోయే ప్రమాదం ఉందని అన్నారు.

పంటలు ఎండిపోకుండా రిజర్వాయర్లను నింపాలని అప్పుడే సాగునీరు కొరత ఉండదని అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని సున్నపురాళ్ల నుండి కుడికిళ్ల వరకు మూడున్నర కిలోమీటర్ల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు పూర్తిచేస్తే సాగునీటి సమస్య ఉండదని, జిల్లా వ్యాప్తంగా 57 టీఎంసీల నీరు రిజర్వాయర్లలో నింపుకోవచ్చని నాలుగు మోటర్లు కూడా నడపవచ్చని తద్వారా సాగునీటి సమస్య ఉండదని ఆయన వివరించారు.

టిఆర్ఎస్ ప్రభుత్వంలో సాగునీటి సమస్య విద్యుత్ సమస్య ఉండేది కాదని కానీ ఈ ప్రభుత్వంలో పర్యవేక్షణ లేక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మంత్రి ఎంపీలు సాగునీటిపై సమీక్ష చేసి పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు సమస్య వస్తే తాను ఊరుకోనని పంట పొలాలు తిరిగి రైతులను అన్యాయం జరగకుండా సాగునీటి సమస్య తీరేవరకు ఉద్యమాన్ని చేస్తానని నాగం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతాంగాన్ని ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

విద్యుత్ కొరత లేకుండా చూడాలని కోరారు రైతులకు మద్దతు ధర మొక్కజొన్న పంటకు వచ్చే విధంగా మార్కెట్లో చూడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ మద్దతు ధర 2400 ఉండగా ఈరోజు 1718 రూపాయలు క్వింటాలకు మార్కెట్లో వచ్చిందని 700 రూపాయల తేడా వచ్చి రైతు నష్టపోవాల్సి వస్తుందని ఆయన వివరించారు రైతులకు మొక్కజొన్న మద్దతు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాగర్ కర్నూల్ మున్సిపల్ కౌన్సిలర్లు అర్జునయ్య తిమ్మాజీపేట పాండు మాజీ జెడ్పిటిసి బాలగౌడ్ సీనియర్ నాయకులు అర్థం రవి ,ఐతోలు లక్ష్మయ్య,సత్యం భీముడు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply