Nadendla Manohar | సకాలంలో ధాన్యం డబ్బులు

Nadendla Manohar | సకాలంలో ధాన్యం డబ్బులు

  • రైతుల ఖాతాలో జ‌మ‌
  • పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్

Nadendla Manohar | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : రైతులకు సకాలంలో ధాన్యం డబ్బులు జమ చేస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ రోజు శ్రీకాకుళం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి పర్యటించారు. శ్రీకాకుళం నగరం అరసవల్లిలో ఉన్న సివిల్ సప్లై గోదాంను సందర్శించి సివిల్ సప్లై ద్వారా అందజేస్తున్న నిత్యావసర వస్తువులు, 20 రూపాయలకే సరఫరా చేస్తున్న గోధుమపిండి, వస్తువుల నాణ్యతను, స్టాకు వివరాలు, రికార్డులను పరిశీలించారు. రేషన్ ద్వారా అందిస్తున్న నిత్యావసరాల నాణ్యతను, తూకం పరిశీలించారు. శ్రీకాకుళం రూరల్ మండలం అప్పంగి పంచాయ‌తీ పరిధిలో రైతులతో మాట్లాడారు. ధాన్యం సేకరణలో రైతులకు సకాలంలో డబ్బులు జమ చేస్తున్నామన్నారు.

Nadendla Manohar

గార మండలం జొన్నలపాడు వద్ద రైస్ మిల్లును ఆకస్మికంగా సందర్శించి ధాన్యం సేకరణ వివరాలను పరిశీలించారు. ఆదే మండలం గొంటి పంచాయితీ రైస్ మిల్లును సందర్శించి ధాన్యం సేకరణ పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కల్లాలను సందర్శించి రైతులతో మాట్లాడి ధాన్యం సేకరణ విధానంపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. గార మండలం రామచంద్రాపురం పంచాయతీలో నిర్వహించిన సమావేశంలో మంత్రి మనోహర్ రైతులకు ధాన్యం సేకరణలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని వివరించారు. అనంతరం నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతుల పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ సకాలంలో రైతుల ధాన్యానికి డబ్బులు జమ చేస్తున్నామని పేర్కొన్నారు. రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తూ కొత్త రాజముద్రలతో ముద్రించిన పాస్ పుస్తకాలను రైతులకి అందజేశారు. సివిల్ సప్లై ఎండి డిల్లేశ్వరరావు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ డి పృధ్వీరాజ్, ఆర్డీవో సాయి ప్రత్యూష, తెదేపా సీనియర్ నాయకులు, కూటమి నాయకులు, శ్రీకాకుళం గార తాసిల్దార్లు గణపతి, చక్రవర్తి, సివిల్ సప్లై డిఎం వేణుగోపాల్, రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులు, రైతులు, జనసేన నాయకులు, రూరల్ గార మండల తెదేపా నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply