ఆరోగ్యకర పోటీ అనివార్యం

ఆరోగ్యకర పోటీ అనివార్యం

కుంటముక్కల బాలికల హాస్టల్ సమగ్రాభివృద్ధికి కృషి.

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్​  

(జి.కొండూరు, ఆంధ్రప్రభ)

పేదల బిడ్డలు చదువుకునే కుంటముక్కల బాలికల హాస్టల్ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్​ అన్నారు.  

జి.కొండూరు మండలం కుంటముక్కల గ్రామంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాల (బాలికలు)లో రూ.40 లక్షలతో రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు  శుక్రవారం శంకుస్థాపన చేశారు. నీటికుంట పనులు పరిశీలించారు. మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు  మాట్లాడుతూ హాస్టళ్లలో విద్యార్థుల విద్య, ఆరోగ్యంపై శ్రద్ధ వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే ఇక్కడ వసతుల మెరుగుపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో ఆహ్లాదకరంగా ఉంటూ చదువుపై దృష్టి నిలిపేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు..విద్యార్థులను తమ సొంత బిడ్డలుగా చూసుకోవాలని వారి అభ్యున్నతికి ఉపాధ్యాయులు అంకిత భావంతో పని చేయాలని అన్నారు.విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన పోటీతత్వం ఉండాలని అన్నారు. దీనివల్ల ఉత్తీర్ణత శాతం పెరుగుతుందన్నారు.

విద్యార్థులకు ఉన్నతమైన భవిష్యత్ అందిస్తామన్న నమ్మకం తల్లితండ్రుల్లో కల్పించడమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామన్నారు. సంక్షేమ వసతి గృహాలలోని విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్షల్లోనూ ప్రతిభ చూపుతున్నారన్నారు.

సంక్షేమ వసతి గృహాల్లోని పిల్లలను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రత మరియు ఆరోగ్య పరిరక్షణ, వసతి గృహాల పరిశుభ్రత మరియు నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) , కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply