Mylavaram | 29 హెల్త్ సెంటర్ల నిర్మాణానికి రూ.9.35 కోట్లు మంజూరు

Mylavaram | 29 హెల్త్ సెంటర్ల నిర్మాణానికి రూ.9.35 కోట్లు మంజూరు

  • మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

Mylavaram | మైలవరం, ఆంధ్రప్రభ : మైలవరం నియోజకవర్గంలో 29 హెల్త్ సెంటర్ల నిర్మాణానికి రూ.9.35 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ వెల్లడించారు. మైలవరం మండలంలోని వెల్వడం గ్రామంలో 15వ ఆర్థికసంఘం నిధులు రూ.36 లక్షలతో హెల్త్ సెంటర్ నిర్మాణానికి ఆయన ఇవాళ‌ శంకుస్థాపన చేశారు.

Mylavaram

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ… ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గ్రామాల్లోనే ఆరోగ్య మందిరాల‌ నిర్మాణంతో ప్రజల సమగ్ర ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. వీటి ద్వారా ఉచిత మందులు, రోగనిర్ధారణ సేవలు, మాతా శిశు సంరక్షణ, మానసిక ఆరోగ్యం వంటి సేవలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు వారి ఇంటి దగ్గర నాణ్యమైన సంరక్షణను అందుబాటులోకి తేవడమే దీని ప్రధాన లక్ష్యమన్నారు.

Mylavaram

హెల్త్ సెంటర్ నిర్మాణం నాణ్యతా ప్రమాణాలు పాటించి సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రధాని మోడీ ఆశీస్సులతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కారు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. పేదల జీవన ప్రమాణాల పెంపునకు కూడా సంక్షేమ పథకాల అమలు దోహదం చేస్తుందన్నారు. మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), తెలుగుదేశం పార్టీ నాయకులు కోమటి సుధాకరరావు, స్థానిక ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.

Mylavaram

Leave a Reply