MyHome Industries | ఉచిత పశు వైద్యశిబిరం

MyHome Industries | ఉచిత పశు వైద్యశిబిరం

MyHome Industries | మేళ్ళచెరువు, ఆంధ్రప్రభ : మేళ్ళచెరువు మండల కేంద్రంలో ఆ రోజు మైహోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్(MyHome Industries Private Limited) సహకారంతో సూర్యాపేట జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మండల పశువైద్య కేంద్రంలో ఉచిత పశువైద్య శిబిరంను ఏర్పాటు చేశారు.

ఈ పశు వైద్య శిబిరాన్ని జిల్లా పశు వైద్యాధికారి శ్రీనివాసరావు, మేళ్లచెరువు సర్పంచ్ బచ్చు పద్మవతి- శ్రీనివాస రెడ్డి, పరిశ్రమ యూనిట్ హెడ్ యన్.శ్రీనివాసరావు లు ప్రారంభించారు. ఈ శిబిరంలో పశువులకు, జంతువులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమగు మందులను పంపిణీ(distributes medicines) చేసారు. ఈ కార్యక్రమంలో మైహోం పరిశ్రమ జీఎం శ్రీరామ్, మాజీ సర్పంచ్ శంకర్ రెడ్డి , మాజీ జడ్పీటీసీ గోవిందరెడ్డి, భాస్కర్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply