విజయపథంలో దూసుకుపోతున్న ముస్కూ దీప్తి నిశాంత్ రెడ్డి

గొల్లపల్లి, ఆంధ్రప్రభ: గొల్లపల్లి పట్టణ సర్పంచ్ అభ్యర్థి ముస్కూ దీప్తి నిశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ముందు నుంచి విజయపథంలో దూసుకుపోతున్నారని స్థానికులు తెలిపారు.

మంత్రీ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అండతో గొల్లపల్లిలో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. దీప్తి నిశాంత్ రెడ్డి గెలిచిన వెంటనే లక్షలాది రూపాయల నిధులను అందించి, పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వనున్నారని హామీ ఇచ్చారు.

అదేవిధంగా, నిరుపేదలకు అందించే “ఇందిరమ్మ ఇల్లు”లను మంజూరు చేయనున్నారు. అలాగే, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, ఇతర మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరిస్తానని దీప్తి నిశాంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

Leave a Reply