హత్య కేసు నిందితుడి అరెస్ట్

హత్య కేసు నిందితుడి అరెస్ట్

ఎడపల్లి , ఆంధ్రప్రభ : ఎడపల్లి మండలం జైతాపూర్  గ్రామ శివారు ప్రాంతంలో ఈ నెల 2న వెలుగు చూసిన హత్య కేసులో నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. బంగారం కోసమే ఆమెను హత్య చేసినట్లు ప్రాధమిక విచారణ లో తేలింది.

బోధన్ రూరల్ సీఐ విజయబాబు తెలిపిన వివరాలు మేరకు మహారాష్ట్రలోని కొండల్వాడి గ్రామానికి చెందిన శీలంవార్ లింగవ్వ(55) ను ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాల కోసం జైతాపూర్ కు చెందిన పురిమేటి బాలకృష్ణ(36) అనే వ్యక్తి హత్య చేసినట్లు విచారణలో తేలినట్లు తెలిపారు. నిందితుని వద్ద నుండి 13 గ్రాముల బంగారు ఆభరణాలు, బైక్, ఆటో, సెల్ ఫోన్, హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్ ను స్వాధీనం చేసుకున్నట్లు సి.ఐ తెలిపారు.

Leave a Reply