Murder | గొడ‌వ‌ను ఆపేందుకు వెళ్లి…

Murder | గొడ‌వ‌ను ఆపేందుకు వెళ్లి…

  • యువకుడు దారుణ హత్య

Murder | హైద‌రాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : హైద‌రాబాద్ న‌గ‌రంలో ఇటీవ‌ల కాలంలో ఏదో ఒక మూలన హత్య ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా న‌గ‌రంలోని టోలిచౌకి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు (murder) గురయ్యాడు. ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవను ఆపేందుకు వెల్లిన యువకుడినికి కత్తితో పొడిచి చంపేశారు. దీంతో ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

ఇర్ఫాన్‌ (24) సోదరుడు అద్నాన్‌, బిలాల్‌ మధ్య టోలిచౌకిలోని పారామౌంట్‌ కాలనీ గేట్‌ నంబర్‌ 4 సమీపంలో ఆదివారం రాత్రి ఘర్షణ చోటుచేసుకున్నది. విషయం తెలుసుకున్న ఇర్ఫాన్‌ అక్కడికి వెళ్లి.. వారిద్దరి మధ్య గొడవను ఆపేందుకు ప్రయత్నించాడు. దీంతో ఇర్ఫాన్‌పై బిలాల్‌లో కత్తితో దాడిచేశాడు. తీవ్రంగా గాయపడిన అతడిని దవాఖానకు తరలించేలోపే మరణించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు (Police) నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి, ఘర్షణకు గల కారణాలపై ఆరాతీస్తున్నారు.

Leave a Reply