Munugodu | అన్ని స్థానాల్లో బీజేపీ పోటీకి సిద్ధం..

Munugodu | అన్ని స్థానాల్లో బీజేపీ పోటీకి సిద్ధం..
- మండల అధ్యక్షుడు పెంబళ్ళ జానయ్య
మునుగోడు, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి స్థానంలో బీజేపీ పోటీకి సిద్ధంగా నిలుస్తుందని మండల పార్టీ అధ్యక్షుడు పెంబళ్ళ జానయ్య తెలిపారు. బీజేపీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మంగళవారం మండల కేంద్రంలోని సత్య ఫంక్షన్ హాల్‌లో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రానున్న సర్పంచ్, వార్డ్ సభ్యుల ఎన్నికల్లో బీజేపీ బలమైన ప్రత్యర్థిగా రంగంలోకి దిగుతుందని చెప్పారు. ప్రజల అభివృద్ధి కోసం పనిచేసే పార్టీ బీజేపీయేనని, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరువచేయడానికి భారీ స్థాయిలో ప్రచారం చేపట్టనున్నట్లు తెలిపారు.
బీజేపీ అభ్యర్థులను ఘన విజయం సాధించేలా కార్యకర్తలు కట్టుబడి పని చేయాలని జానయ్య పిలుపునిచ్చారు. ప్రజలకు పార్టీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి పథంలో నడిపేది బీజేపీయేనని అన్నారు. సభలో రాష్ట్ర, జిల్లా నాయకులు, సీనియర్ నేతలు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
