Munugodu | నిరుపేదలకు అండగా సీఎం సహాయనిధి

Munugodu | నిరుపేదలకు అండగా సీఎం సహాయనిధి
- యువజన కాంగ్రెస్ నల్లగొండ జిల్లా అధ్యక్షులు మేకల ప్రమోద్ రెడ్డి
Munugodu | మునుగోడు, ఆంధ్రప్రభ : సీఎం సహాయనిధి నిరుపేదలకు అండగా నిలుస్తుందని యువజన కాంగ్రెస్ నల్లగొండ జిల్లా అధ్యక్షులు మేకల ప్రమోద్ రెడ్డి (Pramod Reddy) అన్నారు. ఇవాళ నల్లగొండ జిల్లా మునుగోడు మండలం ఎలగలగూడెం గ్రామానికి చెందిన తీర్పారి అంజయ్య కుటుంబానికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో మంజూరైన రూ.60,000ల సిఎం సహాయ నిధి చెక్కును లబ్ధిదారుని కుటుంబ సభ్యులకు ఎలగలగూడెం గ్రామ సర్పంచ్ తీర్పారి నాగమణి ఆంజనేయులుతో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ దాం మంజుల శ్రీశైలం, వార్డు సభ్యుడు రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొమ్ము మహేష్, దాం ఎట్టయ్య, తీర్పారి రాజు, తీర్పారి నాగరాజు, తీర్పారి చింటూ, తీర్పారి నవీన్, తదితరులు పాల్గొన్నారు.
