Munugodu | శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే..

Munugodu | మునుగోడు, ఆంధ్రప్రభ : నూతనంగా ఎన్నికైన కొంపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డ్ సభ్యులు కొంపల్లి అభివృద్ధి ప్రదాత వెదిరె మేఘా రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని వారి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొంపల్లి అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన పాలకవర్గం సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply