మున్సిప‌ల్ కార్మికుల ఆందోళ‌న‌..

ములుగు జిల్లా ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : వేతనాలు రాక మనస్తాపానికి గురై మున్సిపల్ కార్మికుడు (MunicipalWorker) మైదం మహేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న‌తో తోటి కార్మికులు ఆందోళ‌న‌కు దిగారు. మృతుడు కుటుంబానికి రూ.50 ల‌క్ష‌లు ఎక్స్‌గ్రేషియా చెల్లించాల‌ని డిమాండ్ చేశారు. దీంతో ములుగు (Mulugu) మున్సిప‌ల్ కార్యాల‌యం ఎదుట ఉద్రిక్త‌త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

ములుగు మున్సిపాలిటీ పరిధిలోని మాధవరావుపల్లికి చెందిన మైదం మహేశ్ (Maidam Mahesh) (30) మున్సిపాలిటీలో కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో ములుగు గ్రామపంచాయతీగా ఉన్న సమయంలో రెండు నెలల వేతనం అందలేదు. మున్సిపాలిటీగా అవతరించిన తర్వాత మూడు నెలల వేతనం (Three months salary) కలిపి మొత్తం ఐదు నెలల వేతనం అందనట్లుగా తెలుపుతున్నారు. మహేశ్ మినహా మిగిలిన వారికి రెండు నెలల వేతనం అందినట్లుగా సమాచారం. తోటి కార్మికులకు అందరికీ వేతన అంది, తనకు మాత్రమే ఎందుకు ఆగిందని మహేశ్ పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం రాలేకపోయింది.

ఈ క్రమంలో మంగళవారం విధులకు హాజరైన మహేష్ రాత్రి ఏడు గంటల వరకు మున్సిపాలిటీ వద్దే వేతనం కోసం వేచి చూసి, ఒక దిక్కు కుటుంబ పోషణ (Family nutrition) ఇబ్బందిగా మారడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు అతడిని ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. ఎంజీఎంలో చికిత్స పొందుతు బుధవారం రాత్రి మృతి చెందాడు.


మున్సిపాలిటీలో విధులు నిర్వహించిన మైదం మహేష్ కుటుంబానికి న్యాయం చేయాలని మున్సిపల్ కార్యాలయం (Municipal Office) ముందు కార్మికులు ధర్నా చేపట్టారు. అధికారుల తప్పిదం వలనే మహేష్ కు జీతాలు చెల్లించలేదని, పలు మార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎవరు పట్టించుకోలేదన్నారు. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. ఆయన కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.


ములుగు మున్సిపాలిటీలో శానిటేషన్ వర్కర్ గా పని చేస్తున్న మైదాం మహేష్ మృతి బాధాకరం అని, ఆయన మృతి పట్ల మంత్రి సీతక్క (Minister Sitakka) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంచి నీళ్లు అనుకొని తగిన అని స్వయంగా ఆయనే చెప్పారని అన్నారు. కావాలనే బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు రాదంతం చేస్తున్నారని మండిపడ్డారు. మహేష్ మృతిని తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకొని బీజేపీ , బీఆర్ఎస్ (BJP, BRS) నాయకులు రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ఆయన మృతికి గల కారణాలు తెలుసుకొని కారకులైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మృతుని కుటుంబానికి న్యాయం చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు.

Leave a Reply