పన్నులు పెంచలేదు…సవరణలే చేశాం

పన్నులు పెంచలేదు…సవరణలే చేశాం
మున్సిపాలిటీగా మారిన తర్వాత ఆస్తుల పునఃపరిశీలన చేసాం
అండర్ అసెస్‌డ్ ప్రాపర్టీలను గుర్తించి పన్నుల సవరణ చేపట్టాం
మున్సిపల్ గైడ్‌లైన్స్ ప్రకారం మాత్రమే పన్ను విధిస్తున్నాం
సిడిఎంఏ వెబ్‌సైట్ ద్వారా పారదర్శక పన్నుల చెల్లింపులు
మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలి
స్టేషన్ ఘన్ పూర్ మున్సిపల్ కమీషనర్ రాధాకృష్ణ
స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : మూడు రెవిన్యూ గ్రామాలను విలీనం చేసి స్టేషన్ ఘన్ పూర్ మున్సి పాలిటీగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో పన్నుల వ్యవస్థపై స్పష్టతనిస్తూ శుక్రవారం మున్సిపల్ కమీషనర్ రాధాకృష్ణ ఓ ప్రకటనలో విడుదల చేశారు. గ్రామీణ వ్యవస్థలో గతంలో పాలక వర్గాలు, అధికారులు పన్నులను క్రమం తప్పకుండా సవరించకపోవడంతో అనేక ఇంటి నెంబర్లకు తక్కువ పన్నులు వసూలైనట్లు తెలిపారు.
మున్సిపాలిటీగా మారిన తర్వాత ప్రతి ఆస్తిని తిరిగి పరిశీలించి, తక్కువగా అంచనా వేయబడిన అండర్ అసెస్‌డ్ ప్రాపర్టీలను గుర్తించి సవరణలు చేపట్టి నట్లు వెల్లడించారు. ఈ ప్రక్రియలో ఎక్కడా పన్ను రేట్లు పెంచలేదు. ప్రతి ఇంటికి మున్సిపాలిటీ గైడ్‌లైన్స్ ప్రకారం ఉండాల్సిన పన్ను మాత్రమే విధిస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం మాత్రమే ఆస్తి పన్నులు, ట్రేడ్ లైసెన్సులు, నల్లా పన్నులు, ఇతర రుసుములు చట్టబద్ధంగానే వసూలు చేస్తున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం అన్ని పన్నుల చెల్లింపులు సిడిఎంఏ వెబ్‌సైట్ ద్వారా పారదర్శ కంగా జరుగుతున్నాయని తెలిపారు. పన్నులు పెంచలేదు…సవరణలు మాత్రమే చేశామని స్పష్టం చేశారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రజలు తమ పన్నులు సకాలంలో చెల్లించి సహకరించాలని కమిషనర్ రాధాకృష్ణ కోరారు.
