Mukkoti Ekadashi | ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ శివారు ప్రాంతంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఇవాళ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కొండమాచార్యులు ఆధ్వర్యంలో మూలవిరాట్ కు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.
ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో వేణు ఆధ్వర్యంలో భక్తులకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక పూజలలో గ్రామ పెద్దలు తాళ్ళ విజయ్ కుమార్ గౌడ్, శేఖర్ రాజ్, భక్తులు పాల్గొన్నారు.

