MSP Announced | చిత్తూరు రైతుకు చింత తీరినట్టే! తోతాపురి మామిడికి కనీసం భరోసా

క్వింటాలు రూ.1490లు చెల్లింపు
ఏపీ కేంద్రం సర్కార్లు సగం సగం
1,62 లక్షల టన్నులు కొనుగోళ్లుకు అవకాశం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ :

ఆంధ్రాలోని తోతాపురి మామిడి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. 2025–26 సంవత్సరానికి కనీస మద్దతు ధర చెల్లింపును కేంద్రం ఆమోదించించింది. కేంద్రం నిర్ణయంతో ఏపీలో 1.62 లక్షల టన్నుల మామిడి కొనుగోలుకు అవకాశం లభించింది. మామిడి రైతులకు క్వింటాల్‌కు రూ.1,490.73లు చెల్లించనున్నారు. 50 :50 నిష్పత్తితో కేంద్రం, ఏపీ ప్రభుత్వం ఈ మద్దతు ధర చెల్లించనున్నాయి. ఈ మేరకు.. ప్రధాని నరేంద్ర మోడీ, వ్యవసాయ శాఖా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ధన్యవాదాలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ ఈ చర్య ధరల పతనం దెబ్బ నుంచి మామిడి రైతులను కాపాడటానికి అవకాశం లభించిందన్నారు. ఈ చర్య న్యాయమైన రాబడిని నిర్ధారిచండంతో పాటూ గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని పేర్కొన్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

One thought on “MSP Announced | చిత్తూరు రైతుకు చింత తీరినట్టే! తోతాపురి మామిడికి కనీసం భరోసా

Leave a Reply