జర్నలిస్ట్ అంజయ్యను పరామర్శించిన ఎంపీ

జర్నలిస్ట్ అంజయ్యను పరామర్శించిన ఎంపీ
అంజయ్య కు ప్రభుత్వం అండగా ఉంటుంది
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
జనగామ,ఆంధ్రప్రభః జర్నలిస్ట్ అంజయ్య కు ప్రభుత్వం అండగా ఉంటుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోనీ ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ చిటుకుల అంజయ్య ను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పరామర్శించారు. లింగాల గణపురం మండలం వడిచర్ల – కొత్తపల్లి గ్రామం మధ్యలో బైక్ పై వెళ్తున్న జర్నలిస్ట్ చిటుకుల అంజయ్య ను అతివేగంతో వస్తున్న ఆటో ఢీకొనడంతో తీవ్ర గాయాలు కావడంతో జనగామ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ఎం పి జర్నలిస్ట్ అంజయ్య ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిలను అడిగి తెలుసుకున్నారు.
దిగులు పడొద్దు అని మెడికల్ సంబంధించిన ఐదు లక్షల వరకు బిల్లులు ఏమైనా ఉన్నప్పటికీ ప్రభుత్వం ద్వారా వాటి చెల్లించే విధంగా సహాయపడుతానని ఆయన తెలిపారు. హాస్పటల్ సంబంధించిన డాక్టర్లతో ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎంపి మాట్లాడుతు,ప్రభుత్వం ద్వారా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఎం పి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
