శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవంలో పాల్గొన్న ఎంపీ

శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవంలో పాల్గొన్న ఎంపీ

చిలుపూర్, ఆంధ్రప్రభ : చిల్పూర్ మండల కేంద్రంలోని చిల్పూర్ గుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఎంపీకి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కల్యాణోత్సవ కార్యక్రమాలను తిలకిస్తూ భక్తులతో కలిసి భక్తిసేవలో పాల్గొన్నారు..

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యవంతంగా ఉండాలని ఎంపీ ఆకాంక్షించారు. చిల్పూర్ గుట్ట ఆలయం ప్రాంత ప్రజలకే కాకుండా పరిసర జిల్లాల భక్తులకు కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన సహకారం అందించేందుకు తాను కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ లక్ష్మీ ప్రసన్న, దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, ధర్మకర్త మండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, అర్చకులు ఆలయ సిబ్బంది, అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply