ఎంపీ బాలశౌరికి చోటు ఆ క‌మిటీలో చోటు..

మచిలీపట్నం, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రాజ్యాంగ (135వ సవరణ) బిల్లు, 2025, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2025, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వం (సవరణ) బిల్లు, 2025లపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి స్థానం దక్కింది.

ఇటువంటి ప్రతిష్టాత్మక కమిటీలో సభ్యత్వం లభించినందుకు ఎంపీ బాలశౌరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు తన ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply