ఉగాది ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలి..

ఉగాది ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలి..

పటమట ,ఆంధ్రప్రభ : శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. టీచర్స్ కాలనీ ఫన్‌టైమ్స్ క్లబ్‌లో శ్రీపరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిధిగా హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ….ఫన్‌టైమ్స్ క్లబ్‌లో ప్రతి ఏటా తెలుగు నూతన సంవత్సరం ఉగాది వేడుకలు వైభవంగా , అచ్చ తెలుగుతనం ఉట్టిపడేలా జరుగుతాయన్నారు.

ఈ వేడుకలకు హాజరుకావడం తన కెంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. వేడుకలలో భాగంగా విజయవాడ సర్వోత్తమ గ్రంథాలయం నిర్వాహకురాలు రావి శారదను ఘనంగా సత్కరించగా , ఉగాది వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన ఫన్‌టైమ్స్ క్లబ్ సాంస్కృతిక విభాగం విద్యార్థులతో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ చాటిన చిన్నారులకు ఎంపీ శివనాథ్ తన చేతుల మీదుగా బహుమతులను అందజేసి అందరకీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గామల్వేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఫన్ టైమ్స్ క్లబ్ కార్యదర్శి కిలారు వెంకట శివాజీ, వైస్‌ప్రెసిడెంట్ అట్లూరి సుమ బిందు, కమిటీ ప్రతినిధులు కొసరాజు విజయ్‌బాబు, ముప్పవరపు సతీష్‌బాబు, మాజీ కార్పొరేటర్ దేవినేని అపర్ణ, తదితరులు పాల్గొనగా పండితులు చల్లా శ్రీనివాసశర్మ పంచాంగ శ్రవణంను చేశారు.

Leave a Reply